పేద ప్రజల కోసం స్వర్గీయ నందమూరి తారకరామారావు ప్రారంభించిన ఆశయాల సాధనకు అంకితం అవుతామని తెలుగు దేశం యువ నేత మాలెపాటి లోకేష్ పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా దగదర్తి మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద దగదర్తి మండల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాలేపాటి రవీంద్ర నాయుడు ఆదేశానుసారం మండల టిడిపి యువ నాయకులు మాలేపాటి లోకేష్ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ముందుగా మాలెపాటి స్వగృహం నుండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ బైక్ ర్యాలీగా ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు
దగదర్తి మండల సీనియర్ నాయకులు కంచర్ల సునీల్ మరియు నీటి సంఘం అధ్యక్షులు మాలేపాటి సుధాకర్ నాయుడు సమక్షంలో అత్యధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు అక్కడకు చేరుకుని జోహార్ ఎన్టీఆర్.. అమర్ రహే ఎన్టీఆర్.. అంటూ నినాదాలు చేశారు
ఈ సందర్భంగా మాలేపాటి లోకేష్ మాట్లాడుతూ
తెలుగు ప్రజల ఆరాధ్యదైవం, తెలుగుజాతి కీర్తిని ఢిల్లీ స్థాయిలో చాటి చెప్పిన నేత, సినీ రంగమే కాకుండా రాజకీయ రంగంలో సైతం తనదైన ముద్ర వేసుకున్న కారణజన్ముడు అన్న నందమూరి తారక రామారావు అని కొనియాడారు
ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్.టి.ఆర్ ఆశయాల సాధనకు, తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రివర్యులు నారా లోకేష్ అభినందనీయులు అని ప్రశంసించారు.ప్రతి ఏటా నిర్వహించే తెలుగువారి పండుగ మహానాడు అని ఈ మహానాడు పర్వదినాన్ని వర్చువల్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం మన ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు బాధ్యతాయుత నాయకత్వానికి నిదర్శనం అన్నారు
అన్న ఎన్టీఆర్ ఆశయాలు సాధించేందుకు మనమంతా కలిసి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేయడమే ఆయనకు మనమందరం ఇచ్చే ఘనమైన నివాళులు అంటూ.. యుగం ఉన్నంతకాలం యుగపురుషుడు నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల గుండెల్లో జీవించే ఉంటారని మరొకసారి తెలియజేస్తూ… జోహార్ ఎన్టీఆర్ అనే నినాదాలతో హోరెత్తించారు.

ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగిస్తాం దగదర్తి లో మాలెపాటి లోకేష్
పేద ప్రజల కోసం స్వర్గీయ నందమూరి తారకరామారావు ప్రారంభించిన ఆశయాల సాధనకు అంకితం అవుతామని తెలుగు దేశం యువ నేత మాలెపాటి లోకేష్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా దగదర్తి మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద దగదర్తి మండల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాలేపాటి రవీంద్ర నాయుడు ఆదేశానుసారం మండల టిడిపి యువ నాయకులు మాలేపాటి లోకేష్ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా మాలెపాటి స్వగృహం నుండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ బైక్ ర్యాలీగా ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు దగదర్తి మండల సీనియర్ నాయకులు కంచర్ల సునీల్ మరియు నీటి సంఘం అధ్యక్షులు మాలేపాటి సుధాకర్ నాయుడు సమక్షంలో అత్యధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు అక్కడకు చేరుకుని జోహార్ ఎన్టీఆర్.. అమర్ రహే ఎన్టీఆర్.. అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా మాలేపాటి లోకేష్ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆరాధ్యదైవం, తెలుగుజాతి కీర్తిని ఢిల్లీ స్థాయిలో చాటి చెప్పిన నేత, సినీ రంగమే కాకుండా రాజకీయ రంగంలో సైతం తనదైన ముద్ర వేసుకున్న కారణజన్ముడు అన్న నందమూరి తారక రామారావు అని కొనియాడారు ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్.టి.ఆర్ ఆశయాల సాధనకు, తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రివర్యులు నారా లోకేష్ అభినందనీయులు అని ప్రశంసించారు.ప్రతి ఏటా నిర్వహించే తెలుగువారి పండుగ మహానాడు అని ఈ మహానాడు పర్వదినాన్ని వర్చువల్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం మన ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు బాధ్యతాయుత నాయకత్వానికి నిదర్శనం అన్నారు అన్న ఎన్టీఆర్ ఆశయాలు సాధించేందుకు మనమంతా కలిసి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేయడమే ఆయనకు మనమందరం ఇచ్చే ఘనమైన నివాళులు అంటూ.. యుగం ఉన్నంతకాలం యుగపురుషుడు నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల గుండెల్లో జీవించే ఉంటారని మరొకసారి తెలియజేస్తూ… జోహార్ ఎన్టీఆర్ అనే నినాదాలతో హోరెత్తించారు.

