శ్రీ కాళహస్తి, మే 28, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక నిరాశ్రయుల అతిథి గృహం వద్ద తులసి రామ్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం ఆత్మీయ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి మండల ఉపాధ్యక్షుడు మామిళ్ళపల్లి వెంకటేష్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తులసి రామ్ రెడ్డి చేత కేక్ కట్ చేయించి, అక్కడ ఆశ్రయం పొందుతున్న వారికి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. జన్మదిన వేడుకలను ఆడంబరాలకు దూరంగా సామాజిక సేవా కార్యక్రమాల మధ్య నిర్వహించడం అభినందనీయమన్నారు. తులసి రామ్ రెడ్డి విద్యార్థి దశ నుంచే సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ సమాజానికి తోడ్పాటునందిస్తున్నారని కొనియాడారు. సమాజంలోని నిరాశ్రయులు, అవసరమైన వారితో ఆనందాన్ని పంచుకోవడం ద్వారా పండుగ వాతావరణం నెలకొందన్నారు. మామిళ్ళపల్లి వెంకటేష్ నాయుడు మాట్లాడుతూ.. సేవా దృక్పథం కలిగిన వ్యక్తుల జన్మదినాలను ఇలాంటి ప్రదేశాల్లో నిర్వహించడం ద్వారా సమాజానికి మంచి సందేశం వెళ్తుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తులసి రామ్ రెడ్డి స్నేహితులు, బంధువులు, స్థానిక యువకులు మరియు పలువురు సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

నిరాశ్రయుల మధ్య తులసి రామ్ రెడ్డి జన్మదిన వేడుకలు