శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, పొదలకూరు మండలం, పొదలకూరు, పొడమేకల కండ్రిగ, గ్రామాలలో పర్యటించిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి
పొదలకూరు రాక సందర్భంగా బక్రీద్ పండుగను పురస్కరించుకొని కాకాణిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన పొదలకూరు ముస్లిం కుటుంబాలు*
దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న మా గ్రామానికి రహదారి నిర్మించిన ఘనత మీదేనంటూ కాకాణిని ప్రశంసించిన పొడమేకల కండ్రిగ గ్రామస్తులు
కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామంలో మంచినీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు
మీకు అధికారం లేనందువలనే మాకు ఈ కష్టాలంటూ కాకాణి ఎదుట వాపోయిన పొడమేకల కండ్రిక గ్రామస్తులు*
జగన్ పాలన తిరిగి రావాలని తామంతా ఆకాంక్షిస్తున్నామని పేర్కొన్న గ్రామస్తులు*
పొదలకూరులో ఇటీవల మృతి చెందిన వైఎస్ఆర్ సిపి నాయకుడు వేమయ్యతోపాటు , పొడమేకల కండ్రిగలో మృతి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు రమణయ్యల చిత్రపటాలకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన కాకాణి*
ప్రజలకు కూటమిపాలనపై భ్రమలు తొలగిపోయాయి
చంద్రబాబు డ్రామాలతో కాలక్షేపం చేస్తూ, తమను మోసగిస్తున్నాడని ప్రజలకు స్పష్టమైంది
మహానాడు పట్టుమని పదిమంది లేక, వెలవెల పోతుందంటేనే చంద్రబాబుపై ప్రజలలో వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది
కూటమి ప్రభుత్వంలో పాలన సాగిస్తున్న నాయకులందరూ పెత్తందారులుగా వ్యవహరిస్తున్నారు తప్ప, ప్రజా సేవకులన్న విషయం మర్చిపోయారు
ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ,కనీస వసతి సదుపాయాలు కల్పించకుండా, అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికి వదిలేసి, తమను ప్రశ్నించిన వారిపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు
కూటమి ప్రభుత్వంలో పాలకుల తీరును ప్రజలు తీవ్రంగా తప్పుపడుతున్నారు
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, ప్రజలకు అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు
కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు హామీలు ఇచ్చి మోసం చేయడం తప్ప, ప్రజలకు ఒరగపెట్టింది ఏమీ లేదు
సర్వేపల్లి నియోజకవర్గంలో నేను మంత్రిగా, జగనన్న ముఖ్యమంత్రిగా, అనేక అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించాం
ప్రజలకు ఎటువంటి భూ సమస్యలు లేకుండా పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించాం
అధికార పక్షం మాపై ఎన్ని రకాల పసలేని ఆరోపణలు చేసినా , ప్రజలే వారిపై విరచుకుపడుతున్నారు
గ్రామాలకు అవసరమైన రోడ్లు, సైడ్ కాలువలు, త్రాగునీటి వసతి కల్పించాం
గ్రామాలలో రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, సాఫీగా, సమృద్ధిగా,సాగునీరందించాం ఇళ్ళు లేని నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేయడంతో పాటు, ఇళ్ల స్థలాలు లేనివారికి పట్టాలు అందించి , ఇళ్లు మంజూరు చేయించాం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇళ్ల నిర్మాణాన్ని అర్ధాంతరంగా ఆపివేసి , బిల్లులు చెల్లించకుండా పేదవాడి సొంత ఇంటి కల నెరవేరకుండా అడ్డుకున్నారు జగనన్న పాలనలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా అందజేశాం ప్రజలు కూటమిపాలనపై విసిగి, వేసారి జగనన్న పాలన తిరిగి రావాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారఅధికారంలో ఉన్నా ,అధికారం లేకపోయినా, ప్రజలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ,కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, అన్ని విధాలా అండగా నిలుస్తాం



