ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 28 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలోని మనుబోలు, కొలనుకుదురు, మడమనూరు, కాగితాలపూరు గ్రామాల్లో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. త్యాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ బక్రీద్ అని పేర్కొంటూ, కుర్బానీ ద్వారా తమ మొక్కులు తీర్చుకుంటామని తెలిపారు. నమాజ్ అనంతరం ఒకరికొకరు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గా ప్రాంగణాలను ఫ్లెక్సీలు, దీపాలతో అలంకరించి పండుగ వాతావరణాన్ని సృష్టించారు.

మనుబోలు మండలంలో ఘనంగా బక్రీద్ వేడుకలు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 28 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని మనుబోలు, కొలనుకుదురు, మడమనూరు, కాగితాలపూరు గ్రామాల్లో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. త్యాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ బక్రీద్ అని పేర్కొంటూ, కుర్బానీ ద్వారా తమ మొక్కులు తీర్చుకుంటామని తెలిపారు. నమాజ్ అనంతరం ఒకరికొకరు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గా ప్రాంగణాలను ఫ్లెక్సీలు, దీపాలతో అలంకరించి పండుగ వాతావరణాన్ని సృష్టించారు.

