శ్రీ కాళహస్తి, మే 27, (పున్నమి న్యూస్) : తెలుగుదేశం పార్టీ అభివృద్ధి, బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే, రాజంపేట నియోజకవర్గ అబ్జర్వర్ ఎస్సీవీ నాయుడు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాజంపేటలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎస్సీవీ నాయుడికి ఘన స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం స్థానిక పార్టీ నాయకులతో కలిసి మహానాడు డిజిటల్ వేదికల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం, పార్టీ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన అంశాలను వీక్షించారు. కార్యక్రమంలో మాట్లాడిన ఎస్సీవీ నాయుడు.. పార్టీ శ్రేణులు రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజల్లో విశ్వాసం పెంపొందించేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ నేత ప్రకాష్ నాయుడు, శ్రీకాళహస్తి పట్టణ నేత, మాజీ కౌన్సిలర్ అంజూరు సుధాకర్, కయ్యూరి శివతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీడీపీ బలోపేతానికి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలి-ఎస్సీవీ నాయుడు