Sunday, 12 July 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో మహానాడు వేదికపై కార్యకర్తల్లో జోష్ నింపిన ఎమ్మెల్యే బొజ్జల
- తిరుపతి

శ్రీకాళహస్తిలో మహానాడు వేదికపై కార్యకర్తల్లో జోష్ నింపిన ఎమ్మెల్యే బొజ్జల

శ్రీ కాళహస్తి, మే 27, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మహానాడు–2026 ఉత్సవాలను పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా వేడుకలు నిర్వహించాయి. పట్టణ సమీపంలో వున్న CCN కళ్యాణమండపం మండపంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. “జై తెలుగుదేశం” నినాదాలతో మార్మోగిన సభలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ఉత్తేజభరిత ప్రసంగం చేశారు. సమావేశాల రూపం మారొచ్చు…కానీ మహానాడు స్ఫూర్తి ఎప్పటికీ మారదంటూ ఆయన ప్రసంగం ప్రారంభించగానే సభ ప్రాంగణం కరతాళ ధ్వనులతో మార్మోగింది. జాతీయ జెండా దేశ గౌరవానికి ప్రతీక అయితే, పసుపు జెండా తెలుగువారి ఆత్మగౌరవానికి చిహ్నమని పేర్కొంటూ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. గత 45 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం నిరంతరం పోరాడుతోందని గుర్తుచేశారు. కష్టాలు, కేసులు, దాడులు ఎదురైనా పార్టీ సిద్ధాంతాల నుంచి ఎప్పుడూ వెనక్కి తగ్గలేదన్నారు. “ప్రజల నమ్మకమే టీడీపీకి అసలైన బలమని వ్యాఖ్యానించారు. యువతకు ఉద్యోగాలు, రైతులకు సాగునీరు, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పేదలకు అవసరమైంది అవకాశాలు కానీ హింస కాదని చెబుతూ ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రెండేళ్లుగా కరెంట్ ఛార్జీలు పెంచలేదని, భవిష్యత్తులో కూడా ప్రజలపై భారం వేయబోమని హామీ ఇచ్చారు. ఆగస్ట్ 15 నాటికి డిజిటల్ హెల్త్ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తామని ప్రకటించి సభలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. విజన్ పాలిటిక్స్‌కు నాంది పలికింది నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడుతూ, అభివృద్ధే టీడీపీ ధ్యేయమని స్పష్టం చేశారు. సభ ముగిసే సమయానికి కార్యకర్తల్లో కొత్త ఆత్మవిశ్వాసం, మరింత ఉత్సాహం కనిపించింది. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.