ఉత్తరాఖండ్, గుజరాత్ తర్వాత ఉమ్మడి పౌరస్మృతి (UCC) బిల్‌ను ఆమోదించిన మూడో రాష్ట్రంగా అస్సాం నిలిచింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ప్రకారం, పౌరులందరికీ ఒకే చట్టాన్ని వర్తింపజేయడం దీని ముఖ్య ఉద్దేశం. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ దీని అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.
కీలక అంశాలు:
వివాహం, విడాకులు, ఆస్తి వారసత్వంలో లింగ సమానత్వం.
సహజీవనానికి (Live-in) రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
బహుభార్యాత్వం, హలాల్ విధానాలపై నిషేధం.
కాంగ్రెస్ అభ్యంతరం:
ఇది బీజేపీ రాజకీయ అజెండా అని, ఇప్పటికే ఉన్న చట్టాల వల్ల కొత్త చట్టం అవసరం లేదని కాంగ్రెస్ విమర్శించింది.


