అనంతపురం జిల్లా పామిడి పట్టణానికి చెందిన వడగూరు హ్రితిక అద్భుత ప్రతిభ కనబరిచి అండర్-18 కేజీల సబ్ జూనియర్ గర్ల్స్ విభాగంలో బంగారు పతకం సాధించింది. పామిడి పట్టణంలోని నాగిరెడ్డి కాలనీకి చెందిన వడగూరు బాలాజీ జ్యోతి దంపతుల కుమార్తె అయిన హ్రితిక, స్థానిక బ్రూస్లీ తైక్వాండో అకాడమీలో శిక్షణ పొందుతోంది.
అకాడమీ కోచ్ తలారి తులసిరాం ఆధ్వర్యంలో కఠిన సాధన చేసిన హ్రితిక జాతీయ స్థాయిలో విజయం సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోచ్ తలారి తులసిరాంను పలువురు అభినందించారు.

జాతీయ స్థాయిలో మెరిసిన పామిడి చిచ్చరపిడుగు హ్రీతిక
అనంతపురం జిల్లా పామిడి పట్టణానికి చెందిన వడగూరు హ్రితిక అద్భుత ప్రతిభ కనబరిచి అండర్-18 కేజీల సబ్ జూనియర్ గర్ల్స్ విభాగంలో బంగారు పతకం సాధించింది. పామిడి పట్టణంలోని నాగిరెడ్డి కాలనీకి చెందిన వడగూరు బాలాజీ జ్యోతి దంపతుల కుమార్తె అయిన హ్రితిక, స్థానిక బ్రూస్లీ తైక్వాండో అకాడమీలో శిక్షణ పొందుతోంది. అకాడమీ కోచ్ తలారి తులసిరాం ఆధ్వర్యంలో కఠిన సాధన చేసిన హ్రితిక జాతీయ స్థాయిలో విజయం సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోచ్ తలారి తులసిరాంను పలువురు అభినందించారు.

