‘
-తిరుపతి జిల్లా బాధ్యతలు అప్పగించిన జాతీయ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్
-అవినీతి రహిత సమాజమే లక్ష్యమన్న నూతన చైర్మన్
-అన్యాయంపై పోరాటానికి బాధితులు ముందుకు రావాలని పిలుపు
రైల్వే కోడూరు, మే 26: ఎల్లో సింగం ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన ప్రముఖ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ‘ఎస్ అండ్ ఆర్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్’ తిరుపతి జిల్లా నూతన చైర్మన్గా సంకెపల్లి వినోద్ విక్రమ్ రాజా వర్మ నియమితులయ్యారు. ఈ మేరకు సంస్థ వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షుడు డక్కుమళ్ళ సాల్మన్ రాజు, రవికుమార్ శానం, జోసఫ్ డీకొల్లులతో కూడిన ‘నేషనల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్’ మంగళవారం అధికారిక నియామక ఉత్తర్వులను జారీ చేసింది. సమాజంలో పెరుగుతున్న అవినీతిపై పోరాడటంతో పాటు సామాన్యుల హక్కుల రక్షణకు ఆయన నిరంతరం కృషి చేస్తారనే నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినట్లు జాతీయ కమిటీ పేర్కొంది.
-హక్కుల సాధనే శ్వాసగా..
ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా చైర్మన్ వినోద్ విక్రమ్ రాజా వర్మ మాట్లాడుతూ.. తనపై నమ్మకముంచి ఇంతటి కీలక బాధ్యతలను అప్పగించిన జాతీయ నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి జిల్లా పరిధిలో ఎక్కడ అవినీతి జరిగినా ఉపేక్షించేది లేదని, సమాజంలో వెనుకబడిన, అణచివేతకు గురవుతున్న సామాన్య వర్గాల మానవ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా తన వంతు శక్తివంచన లేకుండా శ్రమిస్తానని స్పష్టం చేశారు.
-ప్రభుత్వ శాఖల సమన్వయంతో ముందడుగు:
సమాజంలో ఏ ఒక్కరికీ అన్యాయం జరిగినా, అవినీతి పీడితులను వేధించినా తమ సంస్థ బాధితుల పక్షాన నిలిచి పోరాడుతుందని వర్మ భరోసా ఇచ్చారు. పోలీస్, సీబీఐ, సీఐడీ, విజిలెన్స్ తదితర ప్రభుత్వ ప్రతిష్టాత్మక విచారణా సంస్థలతో సమన్వయం చేసుకుంటూ, చట్ట పరిధిలోనే అవినీతి అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. బాధితులు ఎవరైనా సరే.. భయపడకుండా, అధైర్యపడకుండా తమ సంస్థను ఆశ్రయించి న్యాయం పొందవచ్చని ఆయన పిలుపునిచ్చారు. వినోద్ విక్రమ్ రాజా వర్మ తిరుపతి జిల్లా చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం పట్ల జిల్లాలోని పలువురు సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, మేధావులు మరియు ప్రజా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే తమ పరిధిలో ఎలాంటి సమస్యలు వచ్చినా తమ దృష్టికి తెలపాలని 9052535485 ఈ నెంబర్ కు సంప్రదించాలని కోరారు.



