Monday, 25 May 2026
  • Home  
  • కుటుంబ సమేతంగా ముక్కంటిని దర్శించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
- తిరుపతి

కుటుంబ సమేతంగా ముక్కంటిని దర్శించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

శ్రీ కాళహస్తి, మే 25, (పున్నమి న్యూస్): కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించారు. క్షేత్రానికి చేరుకున్న మంత్రి దంపతులకు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారికి ఆలయంలో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. బొజ్జల రిషితా రెడ్డి స్వయంగా దగ్గరుండి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబానికి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దివ్య దర్శనం చేయించారు. దర్శనం అనంతరం ఆలయ వేద పండితులు మంత్రి కుటుంబానికి ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా రిషితా రెడ్డి స్వామి వారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను కేంద్ర మంత్రికి బహూకరించారు. ఈ కార్యక్రమం అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ….ఆ సర్వేశ్వరుని కరుణాకటాక్షాలు తన కుటుంబంతో పాటు, రాష్ట్ర ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.