Monday, 25 May 2026
  • Home  
  • మహిళల భద్రతే లక్ష్యం… నేరాలపై ఉక్కుపాదం వేస్తాం: ఎలమంచిలి సీఐ హెచ్చరిక
- అనకాపల్లి

మహిళల భద్రతే లక్ష్యం… నేరాలపై ఉక్కుపాదం వేస్తాం: ఎలమంచిలి సీఐ హెచ్చరిక

(పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్) అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి : మహిళలపై జరుగుతున్న నేరాలను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటోందని ఎలమంచిలి సీఐ స్పష్టం చేశారు. ఎలమంచిలి పట్టణ పరిధిలోని వాసవి కళ్యాణ మండపంలో మహిళల భద్రత, సైబర్ నేరాలు, గృహ హింస, వేధింపులపై ప్రత్యేక అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సీఐ ధైర్యం చెప్పారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్, అత్యవసర హెల్ప్‌లైన్ సేవల వినియోగంపై వివరించారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎలమంచిలి రూరల్ ఎస్సై, పట్టణ ఎస్సైలు, మహిళా పోలీసులు, పోలీస్ సిబ్బంది పాల్గొనగా, 200 మందికి పైగా మహిళలు హాజరై అవగాహన పొందారు.

(పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్)
అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి :
మహిళలపై జరుగుతున్న నేరాలను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటోందని ఎలమంచిలి సీఐ స్పష్టం చేశారు. ఎలమంచిలి పట్టణ పరిధిలోని వాసవి కళ్యాణ మండపంలో మహిళల భద్రత, సైబర్ నేరాలు, గృహ హింస, వేధింపులపై ప్రత్యేక అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సీఐ ధైర్యం చెప్పారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్, అత్యవసర హెల్ప్‌లైన్ సేవల వినియోగంపై వివరించారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎలమంచిలి రూరల్ ఎస్సై, పట్టణ ఎస్సైలు, మహిళా పోలీసులు, పోలీస్ సిబ్బంది పాల్గొనగా, 200 మందికి పైగా మహిళలు హాజరై అవగాహన పొందారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.