ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకై కార్మిక శాఖ కార్యాలయం ముందు సిపిఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం అమల్లో అధికార యంత్రాంగం విఫలమైందని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేతనాలు చెల్లించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ అమలు చేయడం లేదన్నారు. రిమ్స్ కార్మికులకు పేషెంట్ కేర్ ప్రమోషన్ లో సీనియర్టీ లో అన్యాయం జరుగుతుందని, సెక్యూరిటీ గార్డులు సీనియర్లకు ప్రమోషన్ ఇవ్వడంలో జాప్యం జరుగుతున్నాయని ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 5 సంవత్సరాల 421 మంది రిమ్స్ కార్మికులు అన్ని విభాగాల నుండి పెరిగిన జీతం అనగా ఏరియర్స్ దాదాపు 5 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉందన్నారు. కాంటాక్ట్ డిపాజిట్ ని జిల్లా కలెక్టర్ జప్తు చేసుకొని ఐదు కోట్ల రూపాయలు తిరిగి కార్మికులకు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుంటాల రాములు, రిమ్స్ సెక్యూరిటీ గార్డ్ నాయకులు కోలా మోహన్, ప్రమోద్, ఉమా, లక్ష్మి, కరుణ పాల్గొన్నారు.

కార్మికులకు కనీస వేతనం చెల్లించాలి