తిరుమల: పున్నమి ప్రతినిధి సురేష్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు కుటుంబ సమేతంగా శుక్రవారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ నిబంధనల ప్రకారం దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, అందరిపై ఆ దేవదేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. తనను గెలిపించిన గన్నవరం నియోజకవర్గ ప్రజలకు నిరంతరం సేవ చేసే భాగ్యం కలగాలని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అవసరమైన శక్తిని, దీవెనలను ప్రసాదించాలని స్వామివారిని కోరుకున్నారు.అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.


