అనకాపల్లి జిల్లా, మే 21 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్):
కోటవురట్ల మండలం ఎండపల్లి అన్నవరం గ్రామంలో దళితుడిపై జరిగిన దాడి తీవ్ర ఆందోళన కలిగించింది. గ్రామానికి చెందిన పెదపూడి రాంబాబును, చైర్లో కూర్చున్నాడనే కారణంతో అగ్రకులానికి చెందిన దుబాసి సురేష్ కులం పేరుతో దూషిస్తూ కర్రతో తలపై దాడి చేసిన ఘటన ఉద్రిక్తత రేపింది. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని వైద్యుల సూచన మేరకు కేజీహెచ్‌కు తరలించనున్నారు. సమాచారం అందుకున్న డిహెచ్పిఎస్ నాయకులు బాధితుడిని పరామర్శించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

కుల అహంకారంతో దళితుడిపై రాక్షస దాడి.. ‘చైర్లో కూర్చుంటావా’ అంటూ తల పగలగొట్టిన దుండగుడు”
అనకాపల్లి జిల్లా, మే 21 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్): కోటవురట్ల మండలం ఎండపల్లి అన్నవరం గ్రామంలో దళితుడిపై జరిగిన దాడి తీవ్ర ఆందోళన కలిగించింది. గ్రామానికి చెందిన పెదపూడి రాంబాబును, చైర్లో కూర్చున్నాడనే కారణంతో అగ్రకులానికి చెందిన దుబాసి సురేష్ కులం పేరుతో దూషిస్తూ కర్రతో తలపై దాడి చేసిన ఘటన ఉద్రిక్తత రేపింది. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని వైద్యుల సూచన మేరకు కేజీహెచ్‌కు తరలించనున్నారు. సమాచారం అందుకున్న డిహెచ్పిఎస్ నాయకులు బాధితుడిని పరామర్శించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

