శ్రీ కాళహస్తి, మే 16 (పున్నమి టెంపుల్ న్యూస్): శని జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తి దేవాలయం ను శనివారం దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన శనీశ్వర స్వామి అభిషేక మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, అనంతరం జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామివార్లను దర్శించుకుని వేద ఆశీర్వచనాలు స్వీకరించారు. రాష్ట్ర ప్రజలు, నియోజకవర్గ ప్రజలపై స్వామి అమ్మవార్ల దివ్య కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. దర్శనానంతరం ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రసాదం కౌంటర్లు, క్యూ లైన్లు, ఆన్‌లైన్ దర్శన వ్యవస్థను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం సులభంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రసాదాల నాణ్యత, భక్తులకు కల్పిస్తున్న వసతులపై అక్కడున్న భక్తులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకున్నారు.

శని జయంతి సందర్భంగా శివాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రత్యేక పూజలు