కావలి మార్కెటింగ్ యార్డ్ లో పాతికేళ్ల క్రితం అప్పటి ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, మెట్టుకూరు రామిరెడ్డి మధ్య జరిగిన విధంగా నేడు రాజకీయ పోరు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మధ్య చైర్మన్ అలేఖ్యల మధ్య ఆవిష్కృతమైంది. నాటి సంఘటనలతో పోలిస్తే నేడు దాదాపు అవే పరిస్థితులు నెలకొన్నాయి. అప్పట్లో యానాది రెడ్డి కి వ్యతిరేకంగా తొలి గా బయటకు వచ్చి వేణుగోపాల్ రెడ్డి విజయం కోసం రామిరెడ్డి తీవ్ర కృషి చేశారు. 99 ఎన్నికల్లో వంటేరు విజయం అనంతరం ఆయన రామిరెడ్డికి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. అడ్డకట్టు పంచతో జిల్లా కేంద్రంలో రాజకీయాలకు అలవాటు పడిన రామిరెడ్డికి ఎమ్మెల్యే వంటేరుకు అతితక్కువ సమయంలో భేదాభిప్రాయాలు నెలకొన్నాయి అనేదానికంటే చుట్టూ ఉండే భజంత్రీలు నెలకొనేలా చేశారు. చంద్రబాబుకు ఎంతో సన్నితుడుగా ఉన్న వంటేరు స్పీడు ను కూడా అప్పటి జిల్లా దేశం నేతలు తట్టుకోవడం కష్టమైంది. ఈ పరిస్థితుల్లో భేదాభిప్రాయాలను తీవ్రం చేసి రామిరెడ్డికి ప్రోత్సాహం ఇవ్వగా ,వంటేరు కూడా తగ్గేదెలా అంటూ మార్కెట్ యార్డ్ చుట్టూ చక్రబంధనం వేశారు. ఆ బంధంలో భాగంగా సమావేశానికి కోరం లేకుండా డైరెక్టర్లను కట్టడి చేశారు. జిల్లా నేతల అండతో ,మార్కెట్ యార్డ్ ఉన్నతాధికారి సహకారంతో రామిరెడ్డి మూడు సమావేశాలకు హాజరుకాని డైరెక్టర్లను తొలగించే జీవోను అమలు చేయబోగా తీవ్ర గందరగోళం నెలకొంది. కొందరు పార్టీ పెద్దల చొరవతో తర్వాత రామిరెడ్డి సర్దుబాటు రావడంతో చిటపటల మధ్య వంటేరు రామిరెడ్డి జిల్లా మార్కెట్ యార్డ్ కద అలా ముగిసిపోయింది.
ప్రస్తుతం సీన్ కట్ చేస్తే… ” సేమ్ టు సేమ్” అదే కధ కావలిలో మొదలైంది. మాజీ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికల ప్రచారంలో పురుష నేతలతో సమానంగా మండుటెండల్లో పార్టీ విజయం కోసం పోరాడిన ఏకైక మహిళా నేతగా పోతుగంటి అలేఖ్య అందరి ప్రశంసలు పొందారు. ఈ క్రమంలో ఆమెకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి సాఫీగానే లభించింది. మరో పదవి పై ఆశ పెట్టుకున్న ఆమెకు పదవి లభించడానికి చాలా సమయం ఉందని తెలియడంతో సీనియర్ మంత్రి సూచనలతో అలేఖ్య మార్కెట్ చైర్మన్ పదవి స్వీకరించారు. కొంత కాలం సజావుగానే సాగినా, సుబ్బానాయుడు మరణానంతరం జరిగిన సంఘటనల నేపథ్యంలో ఆమెకు ఎమ్మెల్యేకు దూరం ఏర్పడిందో ఏర్పడేలా చేశారో చేసారో కానీ గేట్ పడిపోయింది. అప్పటినుంచి ఆమె మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర నేతృత్వంలో తన రాజకీయాన్ని సాగించేందుకు అడుగు వేయడంతో ఎమ్మెల్యే ఏఎంసిల మధ్య అంతర్యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో ఆమెకు తెలియకుండానే ఎమ్మెల్యే యార్డు ఆకస్మిక తనిఖీ చేయడం, కీలక సమావేశాల్లో వేదిక మీద స్థానం లేకుండా చేయడం, ప్రసంగించే అవకాశం లేకుండా చేయడంతో మౌనంగా సర్దుబాటుతో వస్తున్న అలేఖ్య పూర్తిగా “యూటర్న్” తీసుకుంటూ అధిష్టానం దృష్టికి సీనియర్ నేతల సహకారంతో తన పరిస్థితిని వివరించగా, ఆమె ఆవేదనకు స్పందన లభించింది. ఈ క్రమంలో తాజాగా అలేఖ్య ఏర్పాటు చేసిన సమావేశానికి డైరెక్టర్లను హాజరుకానివ్వకుండా చేయడంతో వివాదం తీవ్రమైంది. సమావేశానికి రాని డైరెక్టర్ల వద్దకు కార్యాలయం తరఫున సిబ్బందిని పంపి సంతకాలు పెట్టమని కోరగా డైరెక్టర్లు నిరాకరించడంతో అలేఖ్య ఖంగు తినింది. ఈ అంశాన్ని అవినీతి అంశంగా చిత్రీకరిస్తూ సొంత పార్టీ శిబిరాల నుంచే ఆమె పై దుమ్మెత్తి పోస్తూ కథనాలు రావడంతో ఆమె దిక్కుతోచని స్థితికి గురైంది. ఆమె కోరిక మేరకు తనకు అనుకూలం లేని కార్యదర్శిని జిల్లా మంత్రి సూచనలతో తన కు సంబంధం లేకుండా తొలగించడంతో డైరెక్టర్ల తో అలేఖ్య అడుగు కదలనికుండా చేయడంతో యమ్ యల్ ఎ సఫలం కావడం తో చర్చనీయాంశమైంది. మూడు సమావేశాలకు హాజరుకాని డైరెక్టర్లకు పదవి కోల్పోయే అవకాశం ఉందనే విషయం తెలిపే సీనియర్ నేతలు అధికారులు ,ఎవరు లేకపోవడంతో కావలి మార్కెట్ యార్డ్ వ్యవహారంలో అలేఖ్య సుళువుగా అవుట్ అయింది.
తండ్రి యానాది శెట్టి లాగే ఉడుం పట్టు పట్టే అలేఖ్య కు వ్యతిరేకంగా కొన్ని వైశ్య బృందాలు యమ్ యల్ ఎ శిబిరం లో భారీగా ఉన్నా తటవర్తిరమేష్ తప్ప మిగిలిన వారందరవి ఆడని సినిమాలే “వాట్సాప్ బొమ్మలే”.. కావడం గమనార్హం…పట్టణ స్థాయిలో ప్రజా క్షేత్రంలో అలేఖ్య ను మోటుకునే ఇండివిడ్యువల్ మహిళా నేత ఎవరూ లేరనే చెప్పాలి

కావలి ఏ.ఎం.సి లో పాతికేళ్ల ఆట మళ్లీ… నాడు.. వంటేరు వర్సెస్ రామిరెడ్డి నేడు..చైర్మన్ వర్సెస్ ఎమ్మెల్యే ….
కావలి మార్కెటింగ్ యార్డ్ లో పాతికేళ్ల క్రితం అప్పటి ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, మెట్టుకూరు రామిరెడ్డి మధ్య జరిగిన విధంగా నేడు రాజకీయ పోరు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మధ్య చైర్మన్ అలేఖ్యల మధ్య ఆవిష్కృతమైంది. నాటి సంఘటనలతో పోలిస్తే నేడు దాదాపు అవే పరిస్థితులు నెలకొన్నాయి. అప్పట్లో యానాది రెడ్డి కి వ్యతిరేకంగా తొలి గా బయటకు వచ్చి వేణుగోపాల్ రెడ్డి విజయం కోసం రామిరెడ్డి తీవ్ర కృషి చేశారు. 99 ఎన్నికల్లో వంటేరు విజయం అనంతరం ఆయన రామిరెడ్డికి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. అడ్డకట్టు పంచతో జిల్లా కేంద్రంలో రాజకీయాలకు అలవాటు పడిన రామిరెడ్డికి ఎమ్మెల్యే వంటేరుకు అతితక్కువ సమయంలో భేదాభిప్రాయాలు నెలకొన్నాయి అనేదానికంటే చుట్టూ ఉండే భజంత్రీలు నెలకొనేలా చేశారు. చంద్రబాబుకు ఎంతో సన్నితుడుగా ఉన్న వంటేరు స్పీడు ను కూడా అప్పటి జిల్లా దేశం నేతలు తట్టుకోవడం కష్టమైంది. ఈ పరిస్థితుల్లో భేదాభిప్రాయాలను తీవ్రం చేసి రామిరెడ్డికి ప్రోత్సాహం ఇవ్వగా ,వంటేరు కూడా తగ్గేదెలా అంటూ మార్కెట్ యార్డ్ చుట్టూ చక్రబంధనం వేశారు. ఆ బంధంలో భాగంగా సమావేశానికి కోరం లేకుండా డైరెక్టర్లను కట్టడి చేశారు. జిల్లా నేతల అండతో ,మార్కెట్ యార్డ్ ఉన్నతాధికారి సహకారంతో రామిరెడ్డి మూడు సమావేశాలకు హాజరుకాని డైరెక్టర్లను తొలగించే జీవోను అమలు చేయబోగా తీవ్ర గందరగోళం నెలకొంది. కొందరు పార్టీ పెద్దల చొరవతో తర్వాత రామిరెడ్డి సర్దుబాటు రావడంతో చిటపటల మధ్య వంటేరు రామిరెడ్డి జిల్లా మార్కెట్ యార్డ్ కద అలా ముగిసిపోయింది. ప్రస్తుతం సీన్ కట్ చేస్తే… ” సేమ్ టు సేమ్” అదే కధ కావలిలో మొదలైంది. మాజీ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికల ప్రచారంలో పురుష నేతలతో సమానంగా మండుటెండల్లో పార్టీ విజయం కోసం పోరాడిన ఏకైక మహిళా నేతగా పోతుగంటి అలేఖ్య అందరి ప్రశంసలు పొందారు. ఈ క్రమంలో ఆమెకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి సాఫీగానే లభించింది. మరో పదవి పై ఆశ పెట్టుకున్న ఆమెకు పదవి లభించడానికి చాలా సమయం ఉందని తెలియడంతో సీనియర్ మంత్రి సూచనలతో అలేఖ్య మార్కెట్ చైర్మన్ పదవి స్వీకరించారు. కొంత కాలం సజావుగానే సాగినా, సుబ్బానాయుడు మరణానంతరం జరిగిన సంఘటనల నేపథ్యంలో ఆమెకు ఎమ్మెల్యేకు దూరం ఏర్పడిందో ఏర్పడేలా చేశారో చేసారో కానీ గేట్ పడిపోయింది. అప్పటినుంచి ఆమె మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర నేతృత్వంలో తన రాజకీయాన్ని సాగించేందుకు అడుగు వేయడంతో ఎమ్మెల్యే ఏఎంసిల మధ్య అంతర్యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో ఆమెకు తెలియకుండానే ఎమ్మెల్యే యార్డు ఆకస్మిక తనిఖీ చేయడం, కీలక సమావేశాల్లో వేదిక మీద స్థానం లేకుండా చేయడం, ప్రసంగించే అవకాశం లేకుండా చేయడంతో మౌనంగా సర్దుబాటుతో వస్తున్న అలేఖ్య పూర్తిగా “యూటర్న్” తీసుకుంటూ అధిష్టానం దృష్టికి సీనియర్ నేతల సహకారంతో తన పరిస్థితిని వివరించగా, ఆమె ఆవేదనకు స్పందన లభించింది. ఈ క్రమంలో తాజాగా అలేఖ్య ఏర్పాటు చేసిన సమావేశానికి డైరెక్టర్లను హాజరుకానివ్వకుండా చేయడంతో వివాదం తీవ్రమైంది. సమావేశానికి రాని డైరెక్టర్ల వద్దకు కార్యాలయం తరఫున సిబ్బందిని పంపి సంతకాలు పెట్టమని కోరగా డైరెక్టర్లు నిరాకరించడంతో అలేఖ్య ఖంగు తినింది. ఈ అంశాన్ని అవినీతి అంశంగా చిత్రీకరిస్తూ సొంత పార్టీ శిబిరాల నుంచే ఆమె పై దుమ్మెత్తి పోస్తూ కథనాలు రావడంతో ఆమె దిక్కుతోచని స్థితికి గురైంది. ఆమె కోరిక మేరకు తనకు అనుకూలం లేని కార్యదర్శిని జిల్లా మంత్రి సూచనలతో తన కు సంబంధం లేకుండా తొలగించడంతో డైరెక్టర్ల తో అలేఖ్య అడుగు కదలనికుండా చేయడంతో యమ్ యల్ ఎ సఫలం కావడం తో చర్చనీయాంశమైంది. మూడు సమావేశాలకు హాజరుకాని డైరెక్టర్లకు పదవి కోల్పోయే అవకాశం ఉందనే విషయం తెలిపే సీనియర్ నేతలు అధికారులు ,ఎవరు లేకపోవడంతో కావలి మార్కెట్ యార్డ్ వ్యవహారంలో అలేఖ్య సుళువుగా అవుట్ అయింది. తండ్రి యానాది శెట్టి లాగే ఉడుం పట్టు పట్టే అలేఖ్య కు వ్యతిరేకంగా కొన్ని వైశ్య బృందాలు యమ్ యల్ ఎ శిబిరం లో భారీగా ఉన్నా తటవర్తిరమేష్ తప్ప మిగిలిన వారందరవి ఆడని సినిమాలే “వాట్సాప్ బొమ్మలే”.. కావడం గమనార్హం…పట్టణ స్థాయిలో ప్రజా క్షేత్రంలో అలేఖ్య ను మోటుకునే ఇండివిడ్యువల్ మహిళా నేత ఎవరూ లేరనే చెప్పాలి

