Friday, 15 May 2026
  • Home  
  • రోడ్డు విస్తరణ లేక వాహనదారులకు నిత్య నరకయాతన
- తూర్పు గోదావరి

రోడ్డు విస్తరణ లేక వాహనదారులకు నిత్య నరకయాతన

తాళ్లపూడి, తూర్పుగోదావరి జిల్లా( పున్నమి ప్రతినిధి ), మే 15’కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. రోడ్డు విస్తరణ పనులు జరగకపోవడంతో వాహనదారులు ప్రతిరోజూ ట్రాఫిక్ జామ్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తాళ్లపూడి బస్టాండ్‌ నుంచి మూల మలుపు వరకు రహదారి ఇరువైపులా దుకాణదారులు ఆక్రమణలు చేపట్టడం వల్ల వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా దుకాణాలకు సరుకులు తీసుకొచ్చే లారీలు ట్రాఫిక్ రద్దీ సమయాల్లోనే రోడ్డుపై నిలిపి లోడింగ్, అన్‌లోడింగ్ పనులు నిర్వహించడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని వాహనదారులు వాపోతున్నారు. ప్రతి దుకాణం ముందు పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో వినియోగదారులు తమ వాహనాలను రోడ్డుపైనే నిలిపివేస్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ట్రాఫిక్ సమస్యల కారణంగా ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి ఆక్రమణలను తొలగించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

తాళ్లపూడి, తూర్పుగోదావరి జిల్లా( పున్నమి ప్రతినిధి ), మే 15’కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. రోడ్డు విస్తరణ పనులు జరగకపోవడంతో వాహనదారులు ప్రతిరోజూ ట్రాఫిక్ జామ్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తాళ్లపూడి బస్టాండ్‌ నుంచి మూల మలుపు వరకు రహదారి ఇరువైపులా దుకాణదారులు ఆక్రమణలు చేపట్టడం వల్ల వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా దుకాణాలకు సరుకులు తీసుకొచ్చే లారీలు ట్రాఫిక్ రద్దీ సమయాల్లోనే రోడ్డుపై నిలిపి లోడింగ్, అన్‌లోడింగ్ పనులు నిర్వహించడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని వాహనదారులు వాపోతున్నారు.
ప్రతి దుకాణం ముందు పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో వినియోగదారులు తమ వాహనాలను రోడ్డుపైనే నిలిపివేస్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ట్రాఫిక్ సమస్యల కారణంగా ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.
ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి ఆక్రమణలను తొలగించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.