ఖమ్మం, మే
(పున్నమి న్యూస్ జిల్లా ప్రతినిధి)
ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నేపథ్యంలో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్‌గా విచ్చేసిన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సన్మానించారు.
సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర , మాజీ శాసన సభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి సండ్ర వెంకట వీరయ్య , ఆర్ జేసీ కృష్ణ , మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, ఖమ్మం నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు పగడాల నాగరాజు, కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్ కుమార్, బి నాగ చంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.


