Friday, 15 May 2026
  • Home  
  • పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి : BRS రాష్ట్ర నాయకులు మెంగని మనోహర్ డిమాండ్
- రాజన్న సిరిసిల్ల

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి : BRS రాష్ట్ర నాయకులు మెంగని మనోహర్ డిమాండ్

రాజన్న సిరిసిల్ల జిల్లా /మే 15 /పున్నమి ప్రతినిధి పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని BRS పార్టీ రాష్ట్ర నాయకులు మెంగని మనోహర్ డిమాండ్ చేశారు. లీటర్‌కు రూ.3 చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాన్యులు మరియు మధ్యతరగతి ప్రజలపై ఈ ధరల పెంపు భారీ భారం మోపుతోందన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక ప్రజలపై భారాలు మోపడం బీజేపీ ప్రభుత్వ అసలు స్వరూపాన్ని బయటపెడుతోందని విమర్శించారు. గతంలో 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే ధరల పెంపు నిర్ణయాలు తీసుకోవడం ప్రజలు గమనిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం భారత ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని BRS పార్టీ తరఫున ఆయన డిమాండ్ చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా /మే 15 /పున్నమి ప్రతినిధి

పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని BRS పార్టీ రాష్ట్ర నాయకులు మెంగని మనోహర్ డిమాండ్ చేశారు. లీటర్‌కు రూ.3 చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాన్యులు మరియు మధ్యతరగతి ప్రజలపై ఈ ధరల పెంపు భారీ భారం మోపుతోందన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక ప్రజలపై భారాలు మోపడం బీజేపీ ప్రభుత్వ అసలు స్వరూపాన్ని బయటపెడుతోందని విమర్శించారు.
గతంలో 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే ధరల పెంపు నిర్ణయాలు తీసుకోవడం ప్రజలు గమనిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం భారత ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని BRS పార్టీ తరఫున ఆయన డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.