గౌడ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా నూతన కమిటీ గురువారం విడవలూరు మండలం అన్నారెడ్డిపాలెం గ్రామంలో పర్యటించింది. ఈ సందర్భంగా నిర్వహించిన పరిచయ కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులను గౌడ కులస్తులు ఘనంగా సన్మానించారు. జిల్లా అధ్యక్షులు తెరకాల సీనయ్య గౌడ్ మాట్లాడుతూ, యువత విద్య, రాజకీయ, వ్యాపార రంగాల్లో ఉన్నతంగా ఎదగాలని పిలుపునిచ్చారు. గీత కార్మికులు లైసెన్సులు, గుర్తింపు కార్డులు తప్పనిసరిగా పొందాలని సూచించారు. గ్రామాల్లో సొసైటీల ఏర్పాటు, భవనాల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. ఇంటర్‌లో 988 మార్కులు సాధించిన దద్దోలు ఉషారాణిని సన్మానించి ₹5,000 నగదు బహుమతి అందజేశారు.



