Wednesday, 13 May 2026
  • Home  
  • అడిషనల్ జూనియర్ జడ్జి కృష్ణప్రియకు బార్ అసోసియేషన్ ఘన వీడ్కోలు
- తిరుపతి

అడిషనల్ జూనియర్ జడ్జి కృష్ణప్రియకు బార్ అసోసియేషన్ ఘన వీడ్కోలు

శ్రీకాళహస్తి, మే 13 (పున్నమి టెంపుల్ న్యూస్): శ్రీకాళహస్తి అడిషనల్ జూనియర్ జడ్జిగా సేవలందించిన కృష్ణప్రియ ఒంగోలుకు బదిలీ కావడంతో బుధవారం స్థానిక కోర్టు హాల్‌లో శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యులు న్యాయమూర్తిని శాలువాలు, పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేయగా, శ్రీకాళహస్తిలో ఆమె అందించిన న్యాయసేవలు, విధి నిర్వహణలో చూపిన నిబద్ధత ప్రశంసనీయమని పలువురు వక్తలు కొనియాడారు. న్యాయ వ్యవస్థపై ఆమెకు ఉన్న అంకితభావం యువ న్యాయవాదులకు ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆరంభకం మునిప్రసాద్, కార్యవర్గ సభ్యులు, సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.