ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన అభయాంజనేయ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంచి పరమేశ్వర రెడ్డి పాల్గొని, స్వామి వారి కృపాకటాక్షములు పొందుతూ తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న పరమేశ్వర రెడ్డి, తమ స్వహస్తాలతో భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించి సేవాభావాన్ని చాటిచెప్పారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి పవిత్ర పూలమాలను, ప్రసాదములను అందజేసి పరమేశ్వర రెడ్డి గారిని ఘనంగా ఆశీర్వదించారు.“సేవయే పరమావధి” అనే భావంతో అటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ, ఇటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ నిరంతరం ముందుండే పరమేశ్వర రెడ్డి సేవాస్ఫూర్తిని భక్తులు కొనియాడారు.


