శ్రీకాళహస్తి, మే 11 (పున్నమి టెంపుల్ న్యూస్): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం ‘సోమనాథ్ స్వభిమాన పర్వం’ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రథమమైన సోమనాథ్ క్షేత్ర మహిమను చాటిచెప్పేలా ఈ ఉత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. ముందుగా దేవస్థాన కళావేదిక వద్ద సోమనాథేశ్వరుని చిత్రపటానికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ స్వామివారి చిత్రపటాన్ని పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు హారతులు ఇచ్చి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, కార్యనిర్వహణాధికారి బి.కె. వెంకటేశ్వర్లు, ఏఈఓ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణతో పాటు ప్రాచీన క్షేత్రాల వైభవాన్ని భావితరాలకు పరిచయం చేయడమే ఇటువంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని వారు పేర్కొన్నారు. ఆలయ అర్చకులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

శ్రీకాళహస్తిలో వైభవంగా ‘సోమనాథ్ స్వభిమాన పర్వం’