తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 ఏర్పాట్లు పరిశీలించిన నేతలు
నెల్లూరు జిల్లా కిసాన్ సెజ్‌లో నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు ఏర్పాట్లను పార్టీ నేతలు పరిశీలించారు. మూడు రోజుల పాటు జరిగే మహానాడులో సుపరిపాలన, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, కార్యకర్తల క్షేమంపై కీలక తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. తొలి రెండు రోజులు పార్టీ డెలిగేట్ల సమావేశాలు నిర్వహించగా, మూడో రోజు భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు సుమారు 7 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా వేదికలు, పార్కింగ్, తాగునీరు, భద్రత, రవాణా తదితర ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయని నాయకులు వెల్లడించారు.

తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 ఏర్పాట్లు పరిశీలించిన నేతలు
తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 ఏర్పాట్లు పరిశీలించిన నేతలు నెల్లూరు జిల్లా కిసాన్ సెజ్‌లో నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు ఏర్పాట్లను పార్టీ నేతలు పరిశీలించారు. మూడు రోజుల పాటు జరిగే మహానాడులో సుపరిపాలన, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, కార్యకర్తల క్షేమంపై కీలక తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. తొలి రెండు రోజులు పార్టీ డెలిగేట్ల సమావేశాలు నిర్వహించగా, మూడో రోజు భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు సుమారు 7 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా వేదికలు, పార్కింగ్, తాగునీరు, భద్రత, రవాణా తదితర ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయని నాయకులు వెల్లడించారు.

