చిట్వేల్ పట్టణంలో శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా నిర్వహించనున్న మహోత్సవాలకు సంబంధించి ఆహ్వాన పత్రికను నిర్వాహకులు విడుదల చేశారు. ఈ కార్యక్రమం మే 12, 2026 మంగళవారం రోజున భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.ఉదయం 8 గంటల నుంచి గణపతి పూజ, పుణ్యాహవాచనం, నవగ్రహ ఆరాధన, శ్రీ ఆంజనేయస్వామి వారికీ రుద్రాభిషేకం, వేదపారాయణం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక గ్రామోత్సవం నిర్వహించబడుతుందని, ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని, భక్తులందరూ విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహక కమిటీ విజ్ఞప్తి చేసింది. చిట్వేలి వేమన యోజన సంఘం బ్రాహ్మణ వీధి

హనుమజ్జయంతి మహోత్సవం – ఆహ్వానం పత్రిక విడుదల