దుత్తలూరు
Date:11-5-2026(ఉస్మాన్ పున్నమి ప్రతినిధి )
నెల్లూరు జిల్లా దుత్తలూరు AP మోడల్ స్కూల్కు చెందిన రాష్ట్ర స్థాయి టాపర్ Ch. కరీనా కి మరియు కాకినాడ శంఖవరంకి చెందిన s. స్వాతి కి మంగళగిరి విద్యాభవన్లో జేడీ AP మోడల్ స్కూల్స్సు తహెరా సుల్తానా IAS గారు మరియు డైరెక్టర్స స్కూల్ ఎడ్యుకేషన్ తమిమ్అన్సారీయా IAS గారు ఘనంగా సన్మానం నిర్వహించినారు . SSC-2026 పరీక్షల్లో ఇద్దరూ 594 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చడంతో, పాఠశాల విద్యాశాఖ వారు అభినందించి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో దుత్తలూరు AP మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ J. సైమన్ రావు గారు, విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థినుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం మరియు తల్లిదండ్రుల సహకారంతో ఈ విజయాన్ని సాధించారని కమిషనర్ గారు ప్రశంసించారు.
ఈ సందర్భంగా పాఠశాల అధ్యాపకులు, గ్రామ ప్రజలు మరియు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ టాపర్లకు అభినందనలు తెలిపారు.


