Friday, 1 May 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో మే 7న కంచి యూనివర్సిటీ స్పాట్ కౌన్సెలింగ్
- తిరుపతి

శ్రీకాళహస్తిలో మే 7న కంచి యూనివర్సిటీ స్పాట్ కౌన్సెలింగ్

శ్రీకాళహస్తి, మే 01 (పున్నమి న్యూస్): కంచి కామకోటి పీఠం శంకరాచార్య స్వాములవారిచే స్థాపించబడిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయం (కంచి యూనివర్సిటీ)లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమైనట్లు యూనివర్సిటీ ప్రతినిధులు వెల్లడించారు. స్థానిక విద్యార్థులు, తల్లిదండ్రుల సౌకర్యార్థం మే 7న శ్రీకాళహస్తిలో ప్రత్యేక స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. పానగల్ రోడ్డులోని బ్రాహ్మణ సమాజం కమ్యూనిటీ హాల్‌లో సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు ఈ కౌన్సెలింగ్ జరగనుంది. ఇంజనీరింగ్, ఆయుర్వేదం, మేనేజ్మెంట్, లా, అలైడ్ హెల్త్ సైన్సెస్ (AHS), సంస్కృతం, బి.ఎడ్‌తో పాటు పలు యూజీ, పీజీ కోర్సులకు అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జి. శ్రీనివాస్, డీన్ ప్రొఫెసర్ కె. వెంకటరమణ, శంకరమఠం ప్రతినిధులు పాల్గొని విద్యార్థులకు మార్గదర్శనం చేయనున్నారు. ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా మెరిట్ స్కాలర్‌షిప్స్ కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. యూనివర్సిటీలో తెలుగు విద్యార్థుల శాతం అధికంగా ఉండటంతో పాటు, నాణ్యమైన వసతి, శాకాహార భోజనం, ఆధునిక జిమ్, క్రీడా సౌకర్యాలు, మెరుగైన ప్లేస్‌మెంట్ అవకాశాలు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు నేరుగా హాజరై స్పాట్ అడ్మిషన్ పొందవచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ www.kanchiuniv.ac.in సందర్శించవచ్చు లేదా 9629001144, 8098001630 (ఆయుర్వేదం) నంబర్లను సంప్రదించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.