మల్ రెడ్డి వెంటనే మా ప్రయాణం
కాంగ్రెస్‌లో చేరిన రాయపోల్ సర్పంచ్ అచ్చన మమత శ్రీశైలం
పున్నమి న్యూస్ ప్రతినిధి
ఏప్రిల్ 28
తెలంగాణ ఇన్చార్జి :
రంగారెడ్డి జిల్లా
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధి ఎమ్మెల్యే మల్ రెడ్డి గారితోనే సాధ్యం – రాయపోల్ సర్పంచ్
రాయపోల్ గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తా… ఎమ్మెల్యే రంగన్న
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణకు నిదర్శనంగా రాయపోల్ గ్రామ సర్పంచ్ బీఆర్‌ఎస్‌ను వీడి ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మల్ రెడ్డి రంగారెడ్డి నాయకత్వం, అభివృద్ధి పట్ల ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసంతో గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్నారు. “మల్ రెడ్డి వెంటనే మా ప్రయాణం” అంటూ రాయపోల్ గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే *మల్ రెడ్డి రంగారెడ్డి* మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసే ప్రతి ఒక్కరికీ పార్టీలో సముచిత గౌరవం ఉంటుందని తెలిపారు.
రాయపోల్ సర్పంచ్ అచ్చన మమత శ్రీశైలం చేరికతో స్థానికంగా కాంగ్రెస్ మరింత బలోపేతం అయ్యిందని నాయకులు అభిప్రాయపడ్డారు. గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పట్ల పెరుగుతున్న మద్దతు రాబోయే రోజుల్లో నియోజకవర్గ రాజకీయాల్లో కీలక మార్పులకు నాంది పలుకుతుందని అన్నారు.











