Sunday, 26 April 2026
  • Home  
  • మహిళల సాధికారతకు రోటరీ క్లబ్, రాస్ సంస్థ ముందడుగు
- తిరుపతి

మహిళల సాధికారతకు రోటరీ క్లబ్, రాస్ సంస్థ ముందడుగు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 26 (పున్నమి న్యూస్( : శ్రీకాళహస్తిలో మహిళల ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించేందుకు రోటరీ క్లబ్, రాస్ సంస్థ సంయుక్తంగా ఉమెన్ ఎంపవర్‌మెంట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి Zinnov Group సంస్థ నుంచి లభించిన CSR నిధుల సహకారంతో పలు ఉపాధి అవకాశాలను మహిళలకు అందించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణం, పరిసర గ్రామాలకు చెందిన నలుగురు మహిళలకు ఆటోలు పంపిణీ చేశారు. ఈ వాహనాలు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా, మహిళలకు ఉచిత శిక్షణ అందించేందుకు రాస్ సంస్థకు ఐదు కుట్టుమిషన్లను రోటరీ క్లబ్ అందజేసింది. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు పసుపులేటి పార్థసారథి మాట్లాడుతూ.. మహిళలు స్వయం ఉపాధి ద్వారా సమాజంలో మరింత ముందుకు రావాలని ఆకాంక్షించారు. రాస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి. నాగరాజు, ఉమెన్ ఎంపవర్‌మెంట్ ప్రాజెక్ట్ చైర్మన్ Rtn ఓ. వేణుగోపాల్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ Rtn టి. వెంకటముని తదితరులు మాట్లాడుతూ.. ఈ తరహా కార్యక్రమాలు మహిళల జీవితాల్లో మార్పును తీసుకువస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు ప్రమీల, భార్గవ్ మూర్తి, శ్యామ్, జనార్దన్, చెంగారెడ్డి, నారాయణతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు. అలాగే ఈ ప్రాజెక్టుకు రుణాలు మంజూరు చేసిన యూనియన్ బ్యాంక్ ప్రతినిధులు, రాస్ సంస్థ సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారి సాధికారతకు బలమైన అడుగు పడినట్లు స్థానికులు అభిప్రాయపడ్డారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.