రాజమహేంద్రవరం నగరంలోని ప్రకాశ్ నగర్ లో శ్రీ చైతన్య జూనియర్ & సీనియర్ ఇంటర్మీడియట్ కళాశాలలో “పోలీస్ – స్టూడెంట్స్ ఇంట్రాక్షన్” పేరిట అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా పోలీస్ డీఎస్పీ జి. సుభద్రమ్మ ఆధ్వర్యం లో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మరియు ఎస్.ఐ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు పోక్సో చట్టం, బాల్య వివాహాల ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 వినియోగం, శక్తి యాప్ ఉపయోగాలు, అదేవిధంగా సైబర్ మోసాలపై
సమగ్ర అవగాహన కల్పించారు. అపరిచితులపై నమ్మకం పెట్టుకోవద్దని, ఒంటరిగా ఏకాంత ప్రాంతాలకు వెళ్లకూడదని సూచించారు. ప్రమాదంలో ఉన్నప్పుడు శక్తి యాప్‌ను వినియోగించుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. సమీర్‌తో పాటు సుమారు 100 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

