Wednesday, 22 April 2026
  • Home  
  • ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని నందలూరు శ్రీ సౌమ్యనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
- అన్నమయ్య

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని నందలూరు శ్రీ సౌమ్యనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు

జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి అనారోగ్య కారణాలతో శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో తిరిగి పాల్గొనాలని కోరుతూ నందలూరులోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ అతికారి దినేష్ ఆదేశాల మేరకు, నందలూరు మండల జనసేన నాయకులు కొట్టే శ్రీహరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాయలసీమలో పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పేరుపై అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో పాల్గొని, ప్రజల ఆర్థిక అభివృద్ధికి మరింత బలమైన పునాదులు వేయాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆయన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా శ్రీ సౌమ్యనాథ స్వామి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో పర్నా రామయ్య, అనిమల రామచంద్రయ్య, తోట సుబ్బయ్య, అక్కిశెట్టి రెడ్డయ్య (రాధి), హోటల్ శివ, అనిమల రాము, గాదెరాజు మల్లికార్జున రాజు, రాకేష్, భాస్కర్, హరి బాబు, డాలా, యెద్దల నరసింహా, రత్నం తదితర జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొని పవన్ కళ్యాణ్ గారి సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి అనారోగ్య కారణాలతో శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో తిరిగి పాల్గొనాలని కోరుతూ నందలూరులోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ అతికారి దినేష్ ఆదేశాల మేరకు, నందలూరు మండల జనసేన నాయకులు కొట్టే శ్రీహరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాయలసీమలో పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పేరుపై అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో పాల్గొని, ప్రజల ఆర్థిక అభివృద్ధికి మరింత బలమైన పునాదులు వేయాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆయన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా శ్రీ సౌమ్యనాథ స్వామి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో పర్నా రామయ్య, అనిమల రామచంద్రయ్య, తోట సుబ్బయ్య, అక్కిశెట్టి రెడ్డయ్య (రాధి), హోటల్ శివ, అనిమల రాము, గాదెరాజు మల్లికార్జున రాజు, రాకేష్, భాస్కర్, హరి బాబు, డాలా, యెద్దల నరసింహా, రత్నం తదితర జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొని పవన్ కళ్యాణ్ గారి సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.