అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 21 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్ ): పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన గెడ్డం బుజ్జి అన్నవరం దేవస్థానం బోర్డు డైరెక్టర్‌గా నియమితులైన సందర్భంగా స్థానిక నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గెడ్డం బుజ్జి మాట్లాడుతూ, దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.



