ముస్తాబాద్/ ఏప్రిల్ 21 /పున్నమి ప్రతినిధి
ముస్తాబాద్ మండలంలోని ఆవునూర్, తుర్కపల్లి గ్రామాల్లో ఐకెపి సెంటర్లను ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నర్సింలు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాల్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం లక్ష కోట్లకు పైగా ఖర్చు చేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. రుణమాఫీ, రైతు భరోసా, బీమా, సబ్సిడీల ద్వారా రైతులకు విస్తృతంగా మేలు జరుగుతోందని తెలిపారు.
ప్రభుత్వం చివరి గింజ వరకు వడ్లను కొనుగోలు చేస్తుందని, తెలంగాణ దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా ఎదిగిందని పేర్కొన్నారు. రైతులు పంట మార్పిడి చేపట్టి సన్నవడ్లు, ఆయిల్ ఫామ్, కూరగాయల సాగు వైపు దృష్టి సారించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రెడ్డ భాగ్య మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెలుముల రామిరెడ్డి మాజీ ఎంపీటీసీ గుండం నరసయ్య మండల ఉపసర్పంచ్ పోరం ల అధ్యక్షులు తాళ్ల విజయ్ రెడ్డి మాజీ ఎంపీటీసీ. గుండెలి శ్రీనివాస్ గౌడ్ జిల్లా నాయకులు, కొండం రామ్ రెడ్డి మిర్యాలకర్ శ్రీనివాస్ గ్రామ శాఖ అధ్యక్షులు నాగరాజు మహిళా సమాఖ్య అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు , రైతులు పాల్గొన్నారు.


