ముస్తాబాద్ /ఏప్రిల్ /పున్నమి ప్రతినిధి
ఈరోజు ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మామిండ్ల ఉమ – ఆంజనేయులు దంపతులు తమ కొత్త ఇంటికి గృహప్రవేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కె.కె. మహేందర్ రెడ్డి గారు, ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి గారు హాజరయ్యారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేదలకు స్థిర నివాస సౌకర్యం కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


