Saturday, 18 April 2026
  • Home  
  • చిన్నారి ప్రాణరక్షణకు లోకేష్ సహాయం… తప్పుడు ప్రచారంపై చర్యలు కోరిన టీడీపీ నేతలు
- తిరుపతి

చిన్నారి ప్రాణరక్షణకు లోకేష్ సహాయం… తప్పుడు ప్రచారంపై చర్యలు కోరిన టీడీపీ నేతలు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 18 (పున్నమి న్యూస్) అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ (SMA టైప్-1) వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక వైద్యానికి మంత్రి నారా లోకేష్ అందించిన ఆర్థిక సాయంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన జంపాల మంగళ సురేష్ కుమార్ కుమార్తె పునర్వికకు రూ.16 కోట్ల విలువైన ప్రత్యేక ఇంజెక్షన్ అవసరమైంది. ప్రజల సహకారంతో రూ.10 కోట్లు సమీకరించగా, మిగిలిన రూ.6 కోట్లు మంత్రి నారా లోకేష్ స్వయంగా అందిస్తానని హామీ ఇచ్చి సహాయం చేశారు. అనంతరం అమెరికా నుంచి జోల్ జెన్ స్మా జీన్ థెరపీ ఇంజెక్షన్ తెప్పించి హైదరాబాద్‌లోని రెయిన్‌బో పిల్లల ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చిన్నారికి అందించారు. ఈ సేవాపరమైన చర్యపై ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్న తరుణంలో కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయడం దురదృష్టకరమని నేతలు పేర్కొన్నారు. ఈ నిధులు సీఎంఆర్ఎఫ్ లేదా ఇతర ప్రభుత్వ వనరుల ద్వారా కాకుండా, పూర్తిగా వ్యక్తిగతంగా సమీకరించినవేనని స్పష్టం చేశారు. సేవా కార్యక్రమాలను కూడా విమర్శించడం అనాగరిక చర్యగా అభివర్ణిస్తూ, ప్రజలు ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు విశ్వబ్రాహ్మణ సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ డా.జి.దశరథాచారి,వన్నెకుల క్షత్రియ సంక్షే, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి,రాష్ట్ర కార్యదర్శి మరియు గిరిజన సలహా మండలి సభ్యులు యం.సుబ్బయ్య, తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్,బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు,శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్‌ కోట చంద్రశేఖర్,తిరుపతి పార్లమెంటు నాయకుడు గంగనపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.