శ్రీకాళహస్తి, ఏప్రిల్ 18 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో సామాన్య భక్తుల కోసం అమలులో ఉన్న ₹500 రాహుకేతు పూజలను యధాతథంగా కొనసాగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నియోజకవర్గ కన్వీనర్ కోలా ఆనంద్ ఆదేశాల మేరకు బీజేపీ నాయకులు శనివారం ఆలయ కార్యనిర్వాహణాధికారి (ఈఓ) బి.కె. వెంకటేశులుకు వినతి పత్రం సమర్పించారు. రెండు రోజుల క్రితం జరిగిన పాలకమండలి సమావేశంలో రూ.500 పూజా టికెట్లను రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. రాహుకేతు పూజలకు నిలయమైన శ్రీకాళహస్తిలో సామాన్యులకు పూజలు దూరం చేయడం సరికాదని నేతలు పేర్కొన్నారు. ప్రస్తుతం పేద, మధ్యతరగతి, ధనిక వర్గాల కోసం వేర్వేరు ధరల్లో టికెట్లు అందుబాటులో ఉన్నాయని, ఇందులో సామాన్యులకు భారమయ్యే నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని కోరారు. సనాతన ధర్మ పరిరక్షణతో పాటు సామాన్య భక్తుల ప్రయోజనాల కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆర్. హరీష్ రెడ్డి, చిలకా రంగయ్య, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ప్రజ్ఞాశ్రీ, ఉపాధ్యక్షురాలు రామ్ ఉమా సింగ్, పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి అయ్యప్ప, జీవీ అమర్నాథ్, భరత్ నాయుడు, ఢిల్లీ కుమార్ రెడ్డి, వాసు యాదవ్, మోహన్, కృష్ణారెడ్డి, రవి, చెందు, యశ్వంత్, భార్గవ్ పాల్గొన్నారు.

సామాన్య భక్తులకు పూజలను దూరం చేయొద్దు-శ్రీకాళహస్తి ఈఓకు బీజేపీ నేతల డిమాండ్