శ్రీ కాళహస్తి, జూన్ 03, (పున్నమి న్యూస్) : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తిలోని శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని ప్రముఖ చలనచిత్ర సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్, సినీ గాయకులు శ్రీకృష్ణ, శృతి దర్శిని, అద్వితీయ బుధవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వీరికి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ ఆలయ మర్యాదలతో సాదరంగా స్వాగతం పలికి ప్రత్యేకంగా అంతరాలయ దర్శన భాగ్యం కల్పించారు. సినీ ప్రముఖులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ వేద పండితులు వారికి ఆశీర్వచన మండపంలో వేద ఆశీర్వచనం పలికారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్బంగా సంగీత దర్శకులు మాట్లాడుతూ… శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకోవడం పట్ల థమన్, ఇతర సినీ కళాకారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ మోహన్, ఆలయ ప్రధాన అర్చకులు అర్ధగిరి స్వామి, ఏపీఆర్వో దుర్గాప్రసాద్, పాలకమండలి సభ్యులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తీశ్వరుడి సేవలో ప్రముఖ సంగీత దర్శకుడు థమన్, సినీ గాయకులు