Wednesday, 15 April 2026
  • Home  
  • వేసవి శిబిరాలు శిక్షణ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలి
- మహబూబ్ నగర్

వేసవి శిబిరాలు శిక్షణ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలి

*సమ్మర్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలి : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా:: తేదీ:: 15/04/2026* *మహబూబ్ నగర్ నగరంలోని భగీరథ కాలనీలో ఉన్న మహబూబ్ నగర్ హైస్కూల్‌లో ఆర్‌కే స్పోర్ట్స్ కరాటే డూ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి, జూన్ నెల 5 వరకు నిర్వహించే ఉచిత కరాటే వేసవి శిక్షణా శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే *శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు* సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమ్మర్ క్యాంప్‌కు సంబంధించిన బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. విద్యార్థులు సెలవులను వృథా చేయకుండా, కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచితంగా కరాటే శిక్షణలో సదుపాయం కల్పించామని దీనిని గ్రామీణ ప్రాంత విద్యార్థిని విద్యార్థులు ముఖ్యంగా బాలికలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అకాడమీ నిర్వాహకులు కె. రవికుమార్ , జిల్లా అధ్యక్షుడు మహేందర్, సలహాదారులు ఎంఎన్ విజయ్ కుమార్, సాయి లక్ష్మి, విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు*.

*సమ్మర్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలి : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు*

*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా:: తేదీ:: 15/04/2026*

*మహబూబ్ నగర్ నగరంలోని భగీరథ కాలనీలో ఉన్న మహబూబ్ నగర్ హైస్కూల్‌లో ఆర్‌కే స్పోర్ట్స్ కరాటే డూ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి, జూన్ నెల 5 వరకు నిర్వహించే ఉచిత కరాటే వేసవి శిక్షణా శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే *శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు* సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమ్మర్ క్యాంప్‌కు సంబంధించిన బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. విద్యార్థులు సెలవులను వృథా చేయకుండా, కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచితంగా కరాటే శిక్షణలో సదుపాయం కల్పించామని దీనిని గ్రామీణ ప్రాంత విద్యార్థిని విద్యార్థులు ముఖ్యంగా బాలికలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అకాడమీ నిర్వాహకులు కె. రవికుమార్ , జిల్లా అధ్యక్షుడు మహేందర్, సలహాదారులు ఎంఎన్ విజయ్ కుమార్, సాయి లక్ష్మి, విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు*.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.