తొట్టంబేడు, ఏప్రిల్ 14 (పున్నమి న్యూస్) తొట్టంబేడు మండల వైఎస్సార్సీపీ అధ్యక్షులు డాక్టర్ కోగిల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. తొట్టంబేడు మండలంలోని తన స్వగ్రామమైన పొయ్యలోని స్వగృహంలో వాసుదేవ నాయుడు అభిమానులు, పార్టీ కార్యకర్తల నడుమ కేక్ కట్ చేసి జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల నాయకులు, కార్యకర్తలు ఆయనకు పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ప్రజా సేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో వైసీపీ నాయకులు అంజూరు శ్రీనివాసులు, శ్రీవారి సురేష్‌తో పాటు పార్టీ శ్రేణులు, గ్రామస్థులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.

అభిమాన గణం మధ్య ఉన్నం వాసుదేవ నాయుడు బర్త్‌డే సెలబ్రేషన్స్