Thursday, 11 June 2026
  • Home  
  • సామాజిక సమానత్వానికి అంబేద్కర్ మార్గం-మిద్దెల హరి
- తిరుపతి

సామాజిక సమానత్వానికి అంబేద్కర్ మార్గం-మిద్దెల హరి

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 14 (పున్నమి టెంపుల్ న్యూస్) శ్రీకాళహస్తి మండలం కాపు గున్నేరి గ్రామ సమీపంలోని శ్రీకాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ (SKIIMS) కళాశాలలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 14న వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల కరస్పాండెంట్ మిద్దెల హరి, ప్రిన్సిపాల్ డాక్టర్ గీతా దేవి, విభాగాధిపతులు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాలలో అంబేద్కర్ చిత్రపటాన్ని పూలమాలతో అలంకరించి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు కేక్ కటింగ్ నిర్వహించి జయంతి సంబరాలను ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మిద్దెల హరి మాట్లాడుతూ.. అంబేద్కర్ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నాయకుడు, గొప్ప సంఘ సంస్కర్తగా దేశానికి అపార సేవలు అందించారని తెలిపారు. అంటరానితనం నిర్మూలనకు ఆయన చేసిన కృషి అపారమని, స్వతంత్ర భారతదేశపు తొలి న్యాయశాఖ మంత్రిగా, రాజ్యాంగ శిల్పిగా ఆయన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు అంబేద్కర్ జీవితం, రాజకీయ తత్వం, సమాజ సేవ దృక్పథంపై అవగాహన పెంపొందించుకొని స్ఫూర్తి పొందారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.