Wednesday, 3 June 2026
  • Home  
  • సర్దార్ ఎన్‌జీఓ ఆధ్వర్యంలో స్ఫూర్తిదాయక కార్యక్రమం
- తిరుపతి

సర్దార్ ఎన్‌జీఓ ఆధ్వర్యంలో స్ఫూర్తిదాయక కార్యక్రమం

ఏర్పేడు, ఏప్రిల్ 13 (పున్నమి న్యూస్) భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 136వ జయంతి సందర్భంగా సర్దార్ ఎన్‌జీఓ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన రచనాత్మక పరీక్ష విజయవంతంగా పూర్తైంది. అంబేద్కర్ జీవిత చరిత్ర, ఆయన ఆలోచనలపై అవగాహన పెంపొందించేందుకు ఈ పరీక్షను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. మూడు వెల్ఫేర్ హాస్టళ్లకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు ఈ పరీక్షలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల్లో అంబేద్కర్ భావజాలంపై చైతన్యం కలిగించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని సర్దార్ ఎన్‌జీఓ ప్రతినిధులు పేర్కొన్నారు. పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఏప్రిల్ 14న జయంతి సందర్భంగా బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించిన హాస్టల్ వార్డెన్లు మరియు సర్దార్ టీమ్ సభ్యులకు ఎన్‌జీఓ అధ్యక్షుడు డా. బి.ఎన్. లలిత్ చంద్ర కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.