శ్రీకాళహస్తి, ఏప్రిల్ 13 (పున్నమి న్యూస్) భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అత్యంత విషాదకరమైన సంఘటనగా నిలిచిన జలియన్‌వాలాబాగ్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు జనసేన పార్టీ తరపున ఘన నివాళులు అర్పించినట్లు పార్టీ నాయకులు జయప్రకాష్ తెలిపారు. 1919 ఏప్రిల్ 13న పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో గల జలియన్‌వాలాబాగ్ మైదానంలో సమావేశమైన వేలాది నిరాయుధ భారతీయులపై జనరల్ డయ్యర్ నేతృత్వంలోని బ్రిటిష్ సైనికులు ఎటువంటి హెచ్చరిక లేకుండా కాల్పులు జరిపి అమానుష మారణహోమానికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో వెయ్యికి పైగా నిరపరాధులు ప్రాణాలు కోల్పోయారు. జలియన్‌వాలాబాగ్ సంఘటన కేవలం రక్తపాతం మాత్రమే కాకుండా, భారత స్వాతంత్ర్య పోరాటానికి కీలక మలుపు తీసుకువచ్చిన ఘట్టంగా చరిత్రలో నిలిచింది. అమాయక ప్రజల త్యాగాలే దేశానికి స్వేచ్ఛను అందించాయని జయప్రకాష్ పేర్కొన్నారు. ఈ మారణహోమానికి నేటితో 107 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని ఆయన అన్నారు.

జలియన్‌వాలాబాగ్ అమరవీరుల త్యాగాలు చిరస్థాయి – జనసేన నివాళి