నక్కర్త హనుమాన్ దేవాలయం పునర్నిర్మాణానికి భారీ విరాళం
*11వ వార్డు సభ్యులు వంగూరి మనోహర – జంగయ్య యాదవ్ దంపతులు*
యాభై వేలు రూపాయలు (50,000/-) దేవాలయ పునర్నిర్మాణ విరాళం
పున్నమి న్యూస్ ప్రతినిధి
12 ఏప్రిల్ 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :
నక్కర్త గ్రామంలో ఉన్న పురాతన హనుమాన్ దేవాలయం పునర్నిర్మాణానికి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. గ్రామ అభివృద్ధి, ఆధ్యాత్మిక వాతావరణం కోసం ముందుకు వచ్చిన దాతలు భారీగా విరాళాలు అందజేస్తున్నారు.
ఈ సందర్భంగా దాతగా ముందుకొచ్చినటువంటి ( *వంగూరి మనోహర – జంగయ్య యాదవ్ దంపతులు ప్రస్తుత 11వ వార్డు సభ్యులు యాభై వేలు* రూపాయలు (50,000/-) దేవాలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు కలిసి దేవాలయాన్ని మరింత భవ్యంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు.
దేవాలయం పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత భక్తులకు మరింత సౌకర్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి గ్రామ ప్రజలు, భక్తులు అందరూ తమవంతు సహాయం అందించాలని నిర్వాహకులు కోరుతున్నారు.


