-ఎం. ఈవెంట్స్ మరియు న్యూజెన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా
-ఉచిత క్యాస్టింగ్ కాల్ కొరకు సంప్రదించండి
స్థానిక ప్రసాద్ ఆదిత్య మాల్ వేదికగా ఆదివారం ‘స్టార్ ఐకాన్ ఆఫ్ రాజమండ్రి’ ఫ్యాషన్ షో పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఎం. ఈవెంట్స్ మరియు న్యూజెన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెగా ఫ్యాషన్ షో పోస్టర్‌ను రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఈవెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ, రాజమండ్రిలోని యువతీ యువకుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఈ భారీ ఫ్యాషన్ షోను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోడలింగ్ రంగంలో రాణించాలనుకునే వారికి ఇదొక అద్భుతమైన వేదిక అని, గతంలో ఏలూరులో విజయవంతంగా నిర్వహించిన స్ఫూర్తితో ఇప్పుడు రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదని, ఆసక్తి గల వారు తమ పేర్లను 9949 04 0707 నెంబర్ కు ఫోన్ చేసి ఉచితంగా నమోదు చేసుకోవచ్చని నిర్వాహకులు స్పష్టం చేశారు.
త్వరలోనే క్యాస్టింగ్ కాల్ కొరకు సంప్రదించండి (ఆడిషన్స్) నిర్వహించి, ఫైనల్ షోకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రసాద్ ఆదిత్య మాల్ మేనేజ్‌మెంట్ శరత్, హర్షలకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని మోడలింగ్ ఔత్సాహికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈవెంట్ టీమ్ సభ్యులు, మోడల్స్ మరియు మాల్ ప్రతినిధులు పాల్గొన్నారు.


