శ్రీకాళహస్తి, ఏప్రిల్ 11 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి కైలాసగిరి పర్వతంపై ఉన్న కన్నప్పస్వామికి ప్రథమ అభిషేకం నిర్వహించే ఆనవాయితీని విస్మరించి, గర్భాలయంలోనే నిర్వహిస్తున్న విధానంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి ఇచ్చిన వివరణ సముచితంగా లేదని స్వయంభూ భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు ఒక ప్రకటనలో ఖండించారు. సంప్రదాయ ప్రకారం ముందుగా కొండపై కన్నప్పకు అభిషేకం జరిపి, అనంతరం గర్భాలయంలో వాయులింగేశ్వరునికి పూజలు నిర్వహించాల్సి ఉండగా, ప్రస్తుత విధానం ఆగమ శాస్త్రాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. కన్నప్ప ఆలయాన్ని ఉప ఆలయంగా చూపిస్తూ ద్వితీయ స్థానంలో ఉంచడం తగదని, ఇది చారిత్రక పరంపరను వక్రీకరించడం అవుతుందని విమర్శించారు. కొండపై ఆలయానికి వెళ్లే భక్తులకు సౌకర్యాలు కల్పించకుండా, గర్భాలయంలోనే కార్యక్రమాలు నిర్వహించడం అనుచితమని అన్నారు. ప్రతిరోజూ కొండపై ఆలయం తెరిచి ఉంచడం, శుభ్రత, యాత్రికులకు సదుపాయాలు, అర్చకుల పర్యవేక్షణ వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయంలో భక్తులతో కొందరు సిబ్బంది అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి సేవలను మెరుగుపరచాలని కోరారు. కన్నప్పకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వెనుక సామాజిక వివక్ష కూడా కారణమని ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వం, దేవాదాయ శాఖ తక్షణమే స్పందించి సంప్రదాయాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే అసెంబ్లీ, న్యాయస్థాన స్థాయిలో పోరాటం చేపడతామని, రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

కన్నప్ప ఆలయ ఆచారాలపై వివాదం.. సంప్రదాయాల పునరుద్ధరణకు డిమాండ్