అనకాపల్లి జిల్లా ఏప్రిల్ 10 : ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం ఎంపికైంది. అధ్యక్షుడిగా గణేష్, కార్యదర్శిగా భావాని బాధ్యతలు స్వీకరించారు. స్థానిక క్రీడా అభివృద్ధికి కృషి చేస్తామని కొత్త కమిటీ సభ్యులు తెలిపారు. యువతలో ఫుట్‌బాల్‌పై ఆసక్తి పెంపొందించి జిల్లా స్థాయిలో ప్రతిభావంతులను వెలికితీసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా క్రీడాకారులు, సంఘ సభ్యులు నూతన కార్యవర్గాన్ని అభినందించారు.



