ఎండాకాలంలో ప్రజలు ఆరోగ్యం విషయం లో అప్రమత్తంగా ఉండాలి: మాదాపూర్ సర్పంచ్ భూర మాధురి దిలీప్ గౌడ్
పున్నమి న్యూస్ ప్రతినిధి
10 ఏప్రిల్ 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :
ఎండాకాలంలో ప్రజలు ఆరోగ్యం విషయం లో అప్రమత్తంగా ఉండాలి: మాదాపూర్ సర్పంచ్ భూర మాధురి దిలీప్ గౌడ్*
మాదాపూర్ గ్రామం లో సర్పంచ్ బూర మాధురి దిలీప్ గౌడ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ బూర మాధురి దిలీప్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని శిబిరం నిర్వహించడం జరుగుతుందని గ్రామ ప్రజలు ఆరోగ్యo విషయంలో జాగ్రత్తగా ఉండాలని పిలుపునివ్వడం జరిగింది. డాక్టర్ వెంకటరమణ గారు మాట్లాడుతూ మాదాపూర్ గ్రామంలో ఈ యొక్క ఉచిత వైద్య శిబిరం మంచి స్పందన రావడం జరిగిందని మునుముందు కూడా ఇలాంటి శిబిరాలు మాదాపూర్ గ్రామంలో ఏర్పాటు చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఉప సర్పంచ్ దండు అశోక్, గ్రామ కార్యదర్శి సురేష్,వార్డు సభ్యులు దండు కవిత నాగరాజు,ప్రభుత్వ డాక్టర్లు వెంకటరమణ , సత్యనారాయణ,వెంకటేష్,అలివేలు, ఆశవర్కర్ జ్యోతి కారోబార్ దండు శ్రీధర్, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది






