ABN రాధాకృష్ణ మహిళలంటే ఎంత చులకన భావమా అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాధాకృష్ణ వ్యాఖ్యలు నిరసిస్తూ రాజమహేంద్రవరం స్థానిక ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద బుధవారం వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ మీడియా ముసుగులో రాధాకృష్ణ కొత్త పలుకు కాదని, రాష్ట్ర, దేశం మహిళలకు రాధాకృష్ణ బేషరత్ గా క్షమాపణలు చెప్పాలని, రాధాకృష్ణ దుర్మార్గపు వ్యాఖ్యలు ఖండిస్తున్నామని ఈ వైఖరి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్, నపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్, జక్కంపూడి విజయలక్ష్మి వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొని తీవ్ర అబ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు గోందేశీ శ్రీనివాస్ రెడ్డి, గిరజాల బాబు, నక్కా రాజబాబు, గుర్రం గౌతం, వాసంశెట్టి గంగాధరరావు, మార్గాని సురేష్, దాసి వెంకటరావు, కాటం రజనీకాంత్, దూలం ప్రసాదరావు, మార్తి లక్ష్మి, పోలు విజయలక్ష్మి, సంకిస భవాని ప్రియ, వట్టికూటి కృష్ణ వేణి, అనురాధ , పార్వతీ, తిరగాటి దుర్గారావు, బిల్డర్ చిన్నా, రొక్కం త్రినాథ్, సప్ప ఆదినారాయణ, అరే చిన్ని, పోలు విజయలక్ష్మి అడపా అనిల్, వార్డ్ ఇంచార్జీ లు, వివిధ విభాగాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు కార్యకర్తలు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.


