దుత్తలూరు: ఏప్రిల్ ఒకటవ తారీఖున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి ఆదేశాలతో ఈరోజు మండలంలో కూటమి నాయకులు విస్తృత స్థాయిలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఈరోజు దుత్తలూరు కేంద్రంలో జరిగింది.
ఈ సమావేశంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ముఖ్యంగా సభా ప్రాంగణం ఏర్పాట్లు, భద్రతా చర్యలు, పార్కింగ్ సౌకర్యాలు, ప్రజల సమీకరణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
అలాగే మండలంలోని ప్రతి గ్రామం నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటన మండల అభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో మండల టీడీపీ కన్వినర్ ఉండేలా గురువారెడ్డి గారు,వెంగళరెడ్డి గారూ, మాజి ఎంపీపీ రవీంద్ర బాబు గారూ,నందిపాడు సొసైటీ చైర్మన్ మండవ మధు గారూ, సీనియర్ నాయకులు గురువయ్య నాయుడు, మరియు మండల నాయకులు పాల్గొన్నారు



