Friday, 15 May 2026
  • Home  
  • పాలన గాలికి ఒదిలేసి దొంగ నాటకాలు ఆడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ మరియు కేంద్ర బీజేపీ ప్రభుత్వాలు..!!
- E-పేపర్

పాలన గాలికి ఒదిలేసి దొంగ నాటకాలు ఆడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ మరియు కేంద్ర బీజేపీ ప్రభుత్వాలు..!!

పాలన గాలికి ఒదిలేసి దొంగ నాటకాలు ఆడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ మరియు కేంద్ర బీజేపీ ప్రభుత్వాలు..!! పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 23 మార్చి 2026 రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మరియు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ ఆడుతున్న దొంగ నాటకాలకు వ్యతిరేకంగా ఈరోజు మన ఎల్.బి.నగర్ చౌరస్తా వద్ద BRS పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన *నిరసన కార్యక్రమంలో* పాల్గొనడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం “గ్యాస్ సప్లై ఎక్కడా ఆగలేదు, అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి” అని పేర్కొంటుండగా, రాష్ట్ర ప్రభుత్వం “కేంద్రం నుంచి సరైన సరఫరా లేకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయి” అని చెబుతోంది. ఈ రెండు ప్రభుత్వాల పరస్పర ఆరోపణల మధ్యలో సామాన్య ప్రజలు, రోజువారీ జీవనంపై ఆధారపడే ఆటో డ్రైవర్లు, టిఫిన్ సెంటర్ యజమానులు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ వంటి అనేక వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్ కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి, ఇది నిజమైతే పూర్తిగా అన్యాయమని పేర్కొనడం జరిగింది. ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చడానికి కాంగ్రెస్ నాయకులు ఆ ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ అంటూ దొంగ నాటకాలు ఆడుతున్నారని, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అని, ఇకనైనా మారి ప్రజా సమస్యలు పరిష్కరించే పని చెయ్యాలని వారిని హెచ్చరించడం జరిగింది. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సరఫరా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం, బాధ్యత వహించడం ప్రభుత్వాల కర్తవ్యమని, వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని మాజీ కార్పొరేటర్లు, సీనియర్ BRS పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాళ్లు, ఉద్యమకారులు, పలు విభాగాల కమిటీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, మహిళలు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. *జక్కిడి రఘువీర్ రెడ్డి* *సీనియర్ నాయకులు – BRS పార్టీ* *ఎల్.బి.నగర్*

పాలన గాలికి ఒదిలేసి దొంగ నాటకాలు ఆడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ మరియు కేంద్ర బీజేపీ ప్రభుత్వాలు..!!

పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ ఇంచార్జ్
23 మార్చి 2026

రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మరియు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ ఆడుతున్న దొంగ నాటకాలకు వ్యతిరేకంగా ఈరోజు మన ఎల్.బి.నగర్ చౌరస్తా వద్ద BRS పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన *నిరసన కార్యక్రమంలో* పాల్గొనడం జరిగింది.

కేంద్ర ప్రభుత్వం “గ్యాస్ సప్లై ఎక్కడా ఆగలేదు, అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి” అని పేర్కొంటుండగా, రాష్ట్ర ప్రభుత్వం “కేంద్రం నుంచి సరైన సరఫరా లేకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయి” అని చెబుతోంది. ఈ రెండు ప్రభుత్వాల పరస్పర ఆరోపణల మధ్యలో సామాన్య ప్రజలు, రోజువారీ జీవనంపై ఆధారపడే ఆటో డ్రైవర్లు, టిఫిన్ సెంటర్ యజమానులు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ వంటి అనేక వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్ కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి, ఇది నిజమైతే పూర్తిగా అన్యాయమని పేర్కొనడం జరిగింది.
ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చడానికి కాంగ్రెస్ నాయకులు ఆ ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ అంటూ దొంగ నాటకాలు ఆడుతున్నారని, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అని, ఇకనైనా మారి ప్రజా సమస్యలు పరిష్కరించే పని చెయ్యాలని వారిని హెచ్చరించడం జరిగింది.
ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సరఫరా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం, బాధ్యత వహించడం ప్రభుత్వాల కర్తవ్యమని, వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని మాజీ కార్పొరేటర్లు, సీనియర్ BRS పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాళ్లు, ఉద్యమకారులు, పలు విభాగాల కమిటీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, మహిళలు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
*జక్కిడి రఘువీర్ రెడ్డి*
*సీనియర్ నాయకులు – BRS పార్టీ*
*ఎల్.బి.నగర్*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.